ఆదిలాబాద్ రిమ్స్ వద్ద గల మహాగణపతి దేవాలయంలో ప్రతిష్టించిన వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర శనివారం ఘనంగా నిర్వహించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఎడ్ల బండిలో గణనాథుని ఊ రేగింపు చేశారు. ఎడ్ల బండిని ప్రత్యేకంగా అలంకరించి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు చప్పుల ముందు యువకులు నృత్యాలు చేశారు.