మంత్రాలయం: మండలం వి తిమ్మాపురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త బోయ నరసింహులు గుండెపోటుతో మరణించారు. ఆదివారం విషయం తెలుసుకున్న వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి గ్రామానికి చేరుకొని నరసింహులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈయనతోపాటు వైసీపీ నాయకులు మృతుడికి నివాళులర్పించారు.