కరెంటోల్లు పట్టించుకోరు కష్టాలు తీరడం లేదంటూ NZSR లోని గోర్గల్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదలతో ట్రాన్స్ ఫార్మర్ లన్నీ ద్వంసమయ్యాయి. దీంతో పెద్ద పూల్ బ్రిడ్జి కింది మంజీరా ప్రాంతంలో వరి పోలాలు ఎండిపోతున్నాయి. తమ గోడును విద్యుత్ అధికారులు ఎంతకు పట్టించుకోకపోవడంతో చేసేదేమీలేక రైతులు జనరేటర్ మోటార్లతో పొలాలను పారిస్తున్నారు.ఇప్పటికైనా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు.