నరసరావుపేట సబ్ జైలులో ఉన్న వైసీపీ కార్యకర్తలను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఒక టీడీపీ కార్యకర్త స్వయంగా తన ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసుకుని, వైసీపీకి చెందిన ఈశ్వరరెడ్డి, మల్లి, గోపి, సాంబశివాలపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. సీసీ టీవీ ఫుటేజ్లో ఎవరూ లేకపోయినా అక్రమంగా వారిని జైలుకు పంపారని ఆయన విమర్శించారు.