సంగారెడ్డి మండలం కులబ్ గుర్ సమీపంలోని మంజీర డ్యామ్ నుంచి ఆదివారం 13,333 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. డ్యామ్ ను పరిశీలించిన డీఈ అజీముద్దీన్, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ డ్యామ్ సంగారెడ్డితో పాటు వివిధ ప్రాంతాలకు తాగునీటిని అందిస్తోంది.