విజయనగరం జిల్లా గజపతినగరం గరుడబిల్లి రైల్వేస్టేషన్ల మధ్య బొండపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు విజయనగరం రైల్వే ఎస్సై బాలాజీ రావు తెలిపారు. మృతుని ఒంటిపై పసుపు రంగు టీ షర్టు నలుపు ట్రాక్ ఫాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. రైలు పట్టాలు దాటి క్రమంలో రైలు డీకండం వల్ల గాని లేదా రైలు నుంచి జారి పడటం వలన తగిలిన గాయాలు వలన గాని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండవచ్చు అని రైల్వే పోలీసులు చెప్పారు.