అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన 50 శాతం సుంకాలను తక్షణమే ఎత్తివేయాలని కోరుతూ జగ్గంపేట మండలం రామవరంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ట్రంప్ ఆంక్షల పట్ల మోదీ ప్రభుత్వం ఉదాసీన వైఖరిని విడనాడాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. తక్షణమే ప్రధాని జోక్యం చేసుకుని సుంకాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.