కూసుమంచి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు చెరువులు, కుంటలు నిండిపోయాయి... పాలేరు జలాశయం 22.5 అడుగులు ఉన్న నీటిమట్టం గణనీయంగా పెరిగింది. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి రిజర్వాయర్ గేట్ల మీదుగా నీరు ఉధృతంగా అలుగుపారుతోంది. దిగువన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు...