తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా వక్రీకరిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపినీ ప్రజలు తిప్పి కొట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ విలీనం వాస్తవాలు వక్రీకరణలు జరిగిన అంశంపై సమావేశాన్ని నిర్వహించారు.