కామారెడ్డి జిల్లా కేంద్రంలో రేషన్ డీలర్లు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ.. గత ఐదు నెలల నుంచి కమిషన్లు రాక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.వెంటనే పెండింగ్లో ఉన్న కమిషన్లను విడుదల చేయాలని కోరారు. ఎన్నికల హామీ మేరకు 5000 రూపాయల గౌరవ వేతనాన్ని ఇవ్వాలని ప్రభుత్వంని కోరారు.