Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: కొత్తపల్లి ఆంజనేయ స్వామి సన్నిధిలో జల్దిబిందె కార్యక్రమం

Narayanpet, Narayanpet | Aug 23, 2025
మక్తల్ నియోజకవర్గం ఉట్కూరు మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో శ్రావణమాసం చివరి శనివారం అమావాస్య సందర్భంగా 11:30 గంటల సమయంలో కొత్తపల్లి ఆంజనేయస్వామి సన్నిధిలో జల్దిబిందె కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్యాండ్ సన్నాయి ల నడుమ గోవింద నామ స్మరణతో భజనలతో భక్తులు పిల్లలు మహిళలు గ్రామస్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పూజ కార్యక్రమాలు చేపట్టారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో దేవాదాయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు యువకులు మహిళలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us