న్యాయవాదులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని తప్పనిసరిగా న్యాయవాదుల రక్షణ చట్టం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా న్యాయవాదుల బార్ ప్రెసిడెంట్ బసవరాజ్ పటేల్ అన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లా బారాసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు ఒక్కతాటిపై కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు