ప్రకాశం జిల్లా అక్కల్ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన దంపతులు మగలవారం గిద్దలూరు కోర్టు ఆవరణలో ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే చేరుకున్న కోర్టు సిబ్బంది వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా గతంలో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి గెలిచానని అప్పటినుంచి తమ కుటుంబాన్ని ఓవర్గం వేదిస్తున్నట్లుగా దంపతులు ఆరోపించారు. వినాయక చవితి పండగ రోజు అలానే మంగళవారం తమపై ఓవర్గం దాడి చేసిందని ఈ విషయాన్ని పోలీసులకు చెబితే పట్టించుకోలేదని అన్నారు. జడ్జి వద్దకు వెళ్లి తమ బాధను చెప్పుకునేందుకు వెళితే ఆయన పట్టించుకోకపోవడంతో తాము పురుగుల మందు తాగినట్లు దంపతులు తెలిపారు.