కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో గురువారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి పెద్దమ్మ ఆలయ సమీపంలో విద్యుత్ స్తంభాలు శుక్రవారం నేలకొరిగాయి.. విషయాన్ని గమనించిన స్థానికులు విద్యుత్ సిబ్బందికి సమాచారం తెలిపారు. దీంతో విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో విద్యుత్ అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.