రాజమండ్రిలో శనివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. బొమ్మూరు సమీపంలోని జాతీయ రహదారి 16 పై హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో వెనుక లారీలోని క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు, పోలీసులు స్థానికుల సహాయంతో బయటకు తీసి ఆసుపత్రికి పంపారు.