ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వైయస్సార్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అన్నదాతకు అండగా వైఎస్సార్సీపి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల తొమ్మిదో తేదీ జరిగే అన్నదాత అండగా వైఎస్ఆర్సిపి ఫోర్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగిందని ఎమ్మెల్యే చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.