నల్లగొండ జిల్లా: గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు మండల అధ్యక్షులు భీమ గాని గణేష్ ఆదివారం అన్నారు. తిప్పర్తిలో జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటియూ మండల మహాసభలో ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని ,వేతనాలకు సపరేట్ గ్రాండ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తెలిపారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.