పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో పత్రికా సమావేశంల వైసీపీ అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలందరిని మోసం చేస్తుందని, పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య, విద్య అందకుండా చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించారని, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలని దురుద్దేశంతో ఉందని మండిపడ్డారు.