ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల ప్రజలకు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సాంబశివయ్య సూచించారు. అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దు అన్నారు. బ్యాంకు వివరాలను ఎవరికి చెప్పొద్దని సూచించారు. లాటరీ తగిలిందని ఓటిపి పంపిస్తే మీ ఇంటికి డబ్బులు వస్తాయి అని చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.