అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు లో ఉన్న మసీదు సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భాస్కర్ అనే వృద్ధుడితోపాటు ద్విచక్ర వాహనంలో వస్తున్న ఉస్మాన్ అనే యువకుడికి గాయాలయ్యాయి. గాయపడిన వారిద్దరిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.