బుధవారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు ఆరోగ్యంగా, సుఖశాంతులతో ఉండాలని పూజలు నిర్వహించారు.సకల విఘ్నాలు తొలగించే విఘ్నే శ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మట్టి వినాయకులను పూజించడం వల్ల చెరువులు, జలాశయాలు కలుషితం కావని,మట్టి వినాయకులను పూజించడం మన సంస్కృతి అని తెలిపారు.