యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు రవాణా సదుపాయం కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఉదయం సాయంత్రం వలిగొండ నుంచి మోడల్ స్కూల్ కు బస్సు నడపాలని డిపో మేనేజర్ తో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడారు .అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు.