ముత్తుకూరు మండలం బోడి స్వామి కండ్రికలో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. వినాయక నిమజ్జన ఏర్పాట్లు భాగంగా ఓ వర్గం ట్రాక్టర్ని తీసుకు వెళ్తుండగా మరో వర్గం రాళ్ల దాడి చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గాయపడిన వారిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు మంగళవారం ఉదయం 11 గంటలకి ఎస్ఐ ప్రసాద్ రెడ్డి తెలిపారు