పిల్లల సంరక్షణ చట్టాల పై అవగాహన కల్పించేందుకే ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర రావు అన్నారు. పిల్లల భద్రత, పోక్సో చట్టం - 2012 పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నిర్వహించిన "రైజింగ్ 2047" కార్యక్రమంలో భాగంగా ఈనెల 2, 3 తేదీలలో రెండు రోజుల నిర్వహించే అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలిసి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అవగాహన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.