జనగామ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెప్టెంబర్ 1న జరిగే సిపిఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు జనగామ జిల్లా నుండి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.