ఈనెల 27వ తేదీ నుంచి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న రాకపోకల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఐరల క్రాస్ రోడ్డు నుంచి అగరంపల్లి వరకు ప్రధాన రహదారి గుంతల మయం కావడంతో చిత్తూరు కాణిపాక రాకపోకలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకొని కొత్త రహదారిని వేయడంతో భక్తులు, స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.