స్థానిక గాజుల రేగ నారాయణ పబ్లిక్ స్కూల్లో తెలుగు భాషా దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. విద్యార్థి సిహెచ్ సిద్ధార్థ నాయుడు గిడుగు వెంకట రామమూర్తి వేషధారణతో ఆకట్టుకోగా ఉపాధ్యాయుని బి శిరీష మార్గదర్శన్లో విద్యార్థులు గిడుగు తెలుగు పిడుగు అంటూ నిదానదించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మోయిద నారాయణరావు మాట్లాడుతూ మాతృ తెలుగు భాషా దినోత్సవం అన్య భాషల అధ్యయనానికి బాటలు వేసిందని దేశభాషలందు తెలుగు లెస్సగా నిలిచిందని కొనియాడాను ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.