ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో ఆదివారం పర్యటకులు భారీగా తరలివచ్చారు. గతంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను కారణంగా పర్యటకులు సముద్ర తీరంలో సేద తీరేందుకు అవకాశం లభించలేదు. ప్రస్తుతం సాధారణ పరిస్థితిలో నెలకొనడంతో ఆదివారం పర్యటకులు సముద్ర తీరానికి వచ్చి జలకాలాడుతూ సేద తీరారు. మెరైన్ పోలీసులు సముద్రం లోపలికి ఈతకు వెళ్లకుండా పర్యటకులను నిరోధించారు.