జిల్లాలో ప్రతి 45 రోజులకు ఒకసారి ఏదో ఒక ప్రదేశంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం నగర పశ్చిమ నియోజకవర్గంలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గల కోబాల్ట్ పేటలో ఎస్పీ సతీష్ కుమార్ పలువురు పోలీస్ అధికారులతో కలిసి ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. డాక్యుమెంట్ సరిగా లేని, నెంబర్ ప్లేట్లు లేని 61 ద్విచక్ర వాహనాలను, నాలుగు ఆటోలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మీడియాతో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు.