మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ శనివారం రైతు రుణమాఫీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగు రోజులుగా మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం తహసిల్దార్ కార్యాలయం వద్ద ఘట్కేసర్ రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న దీక్షకు ఆయన హాజరై సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రైతు కంట్లోకి నీరు వస్తే ఆ ప్రభుత్వం ఎక్కువకాలం నిలబడదని అన్నారు.