రంగారెడ్డి జిల్లా నందిగామ లోని చేగూరు గ్రామ సహకార బ్యాంకు వద్ద యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు .బుధవారం ఉదయం నుంచి క్యూలైన్లో వేచి ఉన్నప్పటికీ తమకు సరిపడా యూరియా అందడం లేదని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని ప్రభుత్వం అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూనియన్ అందించాలన్నారు.