ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో లంక గ్రామాలు నీట మునుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయినవిల్లి మండలం పరిధిలోని ముక్తేశ్వరం కాజ్వేపై వరద ప్రవాహం సోమవారం ఉదయానికి మరింత పెరిగింది. దిగువన ఉన్న వీవవల్లిపాలెం, అయినవిల్లిలంక, పల్లపులంక ,అద్దంకివారిలంక లంక గ్రామాల ప్రజలు నాలుగు రోజుల నుండి వరదనీటిలోనే ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు.