సంవత్సరాల తరబడి అపరిష్కృతంగా వున్న ఆర్ధిక, విద్యారంగ సమస్యలు పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 15 నుండి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న 'యుటియఫ్ రణభేరి' జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరి ప్రసాద్, జాబీర్ పిలుపు నిచ్చారు.ఈరోజు సాయంత్రం రాయచోటిలో యుటిఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద రణభేరి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు రూల్పు సమస్యకు పరిష్కారం చూపడం లేదని బదిలీలు, ప్రమోషన్లు పూర్తయి మూడు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులు ఇంకా పాత స్థానాల్లో కొనసాగుతున్నారని, మూడు నెలలుగా మినిమం టైం స్కేలు టీచర్లకు