Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఘనంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి కార్యక్రమం

Nirmal, Nirmal | Sep 5, 2025
నిర్మల్ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి డీఈవో భోజన్న పూలమాలవేసి నివాళులర్పించారు. అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చి దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో ఉపాధ్యాయులందరూ ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు రాజేశ్వర్, ప్రవీణ్ కుమార్, లింబాద్రి, ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డ్ సహాయ కార్యదర్శి భానుమూర్తి పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us