రైతులకు అవసరమైన మేరకు యూరియా అందించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సరఫరా పెంచాలి యూరియా పంపిణీలో బయోమెట్రిక్ విధానం తొలగించాలి.సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్,తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అవసరమైన మేరకు యూరియా అందించడంలో కేంద్ర, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందాయని, రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేక యూరియా అందాకా రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం వైరాలో డివిజన్ సోషల్ మీడియా మండల బాధ్యుల సమావేశం బాజోజి రమణ అధ్యక్షతన జరిగింది.