జిల్లాకు కావలసినంత యూరియా వస్తుంది, రైతులందరికీ సరఫరా చేస్తాం: కృష్ణ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లాకు కావలసినంత యూరియా వస్తుందని, రైతులందరికీ సరఫరా చేస్తామని, ఎవరు ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జిల్లా కలెక్టర్ చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. యూరియా పొందిన రైతులు బస్తాలను వారి స్కూటర్లలో పెట్టుకొని తీసుకెళ్లడం జిల్లా కలెక్టర్ గమనించారు.