పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ASF కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో స్వల్ప తోపులాట జరిగింది. కలెక్టర్ రావాలని విద్యార్థులు నినాదాలు చేశారు. కలెక్టర్ రాకపోవడంతో కలెక్టర్ ఛాంబర్ లోకి పోయే ప్రయత్నం చేయగా ప్రధాన గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.