నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాగంటి నందవరం చౌడేశ్వరి అమ్మవారి ఆలయాలను ఆలయ అధికారులు ఆదివారం చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ చంద్రకళ కారణంగా ఆలయాన్ని మూసివేసామని తిరిగి సోమవారం తెల్లవారుజాము ఆలయాలను శుద్ధిచేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేద పండితులు అధికారులు పాల్గొన్నారు