ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హసనాపురం గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై చిరుత పులి పిల్ల కలకలం రేపింది. బుధవారం రాత్రి సమయంలో జాతీయ రహదారిపై పులి పిల్ల కనిపించడంతో గ్రామస్తులు దాన్ని బంధించి అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని బుట్టలో బంధించి ఉన్న చిరుత పులి పిల్లను గిద్దలూరు అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. జంతువుల పరీక్షించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.