వర్షాకాలం దృష్ట్యా గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు సంచార వైద్య వాహన సేవలు అందుబాటులో ఉండాలని , మాత శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇంచార్జ్ డిఎంహెచ్‌ఓ డా.రవికుమార్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ లోని మినీ సమావేశ మందిరంలో పీఎం జన్మన్ సంచార వైద్య వాహన వైద్య అధికారులతో సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈçసందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో గిరిజన ప్రాంతాలకు వెళ్ళే రోడ్లు కట్ అయ్యి రవాణాకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నందున గర్భవతులను ప్రసవ తేదికంటే పదిరోజుల ముందుగా అచ్చంపేట ప్రాంతీయ ఆసుపత్రిలో గల బర్త్ వెయిటింగ్ హోమ్ లో ముందస్తుగా చేర్చాలని తెలిపారు.