మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్బిఐ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో బ్యాంక్ ఎదుట ఆదివారం సాయంత్ర ఖాతాదారులు ఘనంగా సంబురాలు నిర్వహించారు. నిందితులను అరెస్ట్ చేసిన సందర్భంగా బ్యాంక్ ఎదుట బాణా సంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. పోలీస్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. తమ బంగారం రికవరీకి కృషి చేసిన రామగుండం సీపీ, జైపూర్ ఏసీపీ, చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్ పోలీసులు కృషికి కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంక్ యాజమాన్యం కూడా తమకు సహకరించి తమ బంగారాన్ని తమకి త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.