వరద ప్రభావంతో దెబ్బతిన్న పనుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం విడుదల చేసిన 10 కోట్ల రూపాయలతో చేపట్టిన అత్యవసర పనులను నాణ్యతతో వేగంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేచించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వరద అనంతరం చేపట్టిన పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సంభవించిన అధిక వరద అనంతరం దెబ్బతిన్న మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు.