కొందుర్గు మండల కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానికులు ఆదివారం మధ్యాహ్నం మీడియాతో వివరాలను వెల్లడించారు. క్షుద్ర పూజలు చేయడం వల్ల గుడికి వచ్చే వారు కూడా రావడంలేదని ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వారు కోరారు. ఇలా చేయడం వల్ల చాలా భయాందోళనకు గురవుతున్నారని చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఇలాంటివి పునరావతం కాకుండా చూడాలని కోరారు.