అన్నమయ్య జిల్లాలోని బొప్పాయి ధరలు పతనం కావడంతో రైతులు సమ్మె బాట పట్టారు. శుక్రవారం ఉదయం నుంచి ప్రతి గ్రామంలో బొప్పాయి లారీలు వెళ్లకుండా రహదారుల్లో వరిగడ్డి దగ్ధం చేసి నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు లెక్కచేయకుండా దళారీ వ్యవస్థ రైతులు మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బొప్పాయి కి కనీసం మద్దతు ధర ప్రకటించే వరకు సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు.