షాద్నగర్ ఆర్డివో కార్యాలయంలో ఆర్డీవో వెంకట మాధవరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలకు, సమావేశాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్, అనుమతులు, రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లకు సంబందించిన వాటిపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డివో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూలుకు సంబంధించి తేదీలు 18న ప్రారంభం కావడం జరిగిందని తెలిపారు.