కల్హేర్ మండలం కృష్ణాపూర్ లో సొసైటీ భవనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను అడ్డుకోవడం సమంజసం కాదని కల్హేర్ మాజీ జడ్పిటిసి నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం నారాయణఖేడ్ లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సొసైటీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కృష్ణ గౌడ్ , మండల నాయకులు ఉన్నారు.