ప్రకాశం జిల్లా పుల్లలచెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు వైద్య విధానం పై మెడికల్ ఆఫీసర్ శ్రీనాథ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రికి వచ్చిన విద్యార్థులకు మెడికల్ ఆఫీసర్ శ్రీనాథ్ ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే వైద్యంపై వివరించి పరీక్షల కోసం ఉపయోగించే యంత్రాలపై వారికి అవగాహన కల్పించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని శ్రీనాథ్ విద్యార్థులకు సూచించారు.