Parvathipuram, Parvathipuram Manyam | Aug 25, 2025
ఉదృతంగా ప్రవహిస్తున్న కాలువను దాటేందుకు కొండరేజేరు గ్రామస్తులు వెదురు కర్రలతో వంతెనను నిర్మించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని కొండరేజేరు అలాగే సీతానగరం మండలంలోని బల్లకృష్ణాపురం గ్రామాల వారు గ్రామం నుంచి వెలుపలకు వెళ్లాలంటే గ్రామ సమీపంలో ఉన్న కాలువను దాటాల్సి ఉంది. అయితే ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో కాలువ ఉదృతంగా పాడుతోంది. అత్యవసర పరిస్థితులలో ఊరు దాటేందుకు వీలుగా కాలువపై వెదురుకారులతో గ్రామస్తులు రెండు రోజులు శ్రమించి, తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేసుకున్నారు.