వెంకటాపూర్ మండలం చెంచు కాలనీ వానగుట్ట వద్దగల కోళ్ల ఫారంలో పులి సంచరించిన సీసీటీవీ ఫుటేజీని ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ డోలి శంకర్ నిన్న గురువారం రోజున సాయంత్రం ఐదు గంటలకు పరిశీలించారు. కోళ్ల ఫారంలో సంచరించిన జంతువు అడుగులు పరిశీలించగా అది జంగపిల్లిగా నిర్ధారించామన్నారు. ప్రస్తుతం రామప్ప వాన గుట్ట ప్రాంతంలో పులి లేదని, వెంకటాపూర్ అడవుల్లోకి వెళ్లినట్లుగా గుర్తించామన్నారు. ప్రజలు ఎవరు అపోహలకు భయభ్రాంతులకు గురికావద్దని సూచించారు.