గుత్తి పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలో శనివారం ఓ వేప భారీ వృక్షం నేల కూలింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వృక్షం కూలిపోయింది. వృక్షం నేలకూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చెట్టు కూలిపోయిన విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు నేల కూలిన చెట్టును పరిశీలించారు.